పాట్నా: బీజేపీ పాలిత బీహార్‌లోని చౌరాసన్ దేవాలయానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న రోప్‌వే శుక్రవారం కుప్పకూలింది. రోహ్తాస్ బ్లాక్ హెడ్‌క్వార్టర్స్‌కు ఈ దేవాలయాన్ని అనుసంధానం చేస్తూ రూ.13 కోట్లతో నిర్మిస్తున్న ఈ రోప్‌వే ట్రయల్ రన్లో ఈ దుర్ఘటన జరిగింది.ట్రయల్ సమయంలో బరువును స్తంభం భరించలేకపోయిందని, ఫలితంగా ట్రాలీతోపాటు స్తంభం కూలిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదన్నారు. రోప్ వే ప్రాజెక్టులో వాడే సామగ్రి నాణ్యత, భద్రతా ప్రమాణాలపై స్థానికులు ప్రశ్నలు సంధించారు. ఈ దుర్ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎల్జేపీ ఎమ్మెల్యే ప్రసాద్ గౌతమ్ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. అధికారులు, ఇంజినీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. స్తంభం నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.