న్యూఢిల్లీ : గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) (Delhi Services Bill) బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఆర్జేడీ నేత, ఎంపీ మనోజ్ ఝా వ్యతిరేకించారు. దేశంలో సమాఖ్య వ్యవస్ధపై ఎలాంటి దాడి ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నది రేపు ఇతర రాష్ట్రాల్లోనూ జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తాము ఈ విషయం పదేపదే చెబుతున్నామని, దేశ సమాఖ్య వ్యవస్ధపై దాడి ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. అంతకుముందు ఈ బిల్లును పార్లమెంట్లో తమ పార్టీ వ్యతిరేకిస్తుందని కాంగ్రెస్ నేత కే సురేష్ పేర్కొన్నారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఇప్పటికే స్పష్టం చేశామని గుర్తుచేశారు. కాగా, ఈ ఆర్డినెన్స్‌పై బుధవారం లోక్‌సభలో చర్చ జరగనుంది.
ఢిల్లీలో చట్టాలు చేసే అధికారం కేంద్రానికి ఉంటుందని, ఇది రాజ్యాంగంలోనే పొందుపరిచారని, బిల్లు లోక్‌సభలో ప్రవేశపెడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దీనిపై అభ్యంతరాలన్నీ రాజకీయపరమైనవేనని పేర్కొన్న షా బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతించాలని స్పీకర్‌ను కోరారు.
Read More :
Haryana Curfew: హర్యానాలో నలుగురు మృతి.. నుహ్ జిల్లాలో కర్ఫ్యూ