Haryana Curfew: హర్యానాలో నలుగురు మృతి.. నుహ్ జిల్లాలో కర్ఫ్యూ
Haryana Curfew: నుహ్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. అక్కడ జరిగిన హింసలో మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరుకున్నది. వీహెచ్‌పీ ఊరేగింపు సమయంలో ఓ వర్గం ఘర్షణకు దిగింది. ఆ తర్వాత జరిగిన అల్లర్లలో వాహనాలు ధ్వంసం అయ్యాయి.
గురుగ్రామ్: హర్యానా(Haryana)లోని నుహ్ జిల్లాలో సోమవారం రాత్రి నుంచి కర్ఫ్యూ(Curfew) విధించారు. సోమవారం అక్కడ రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే రాత్రి పూట ఎటువంటి సంఘటన జరగలేదని డీసీ ప్రశాంత్ పన్వార్ తెలిపారు. రాత్రిపూట పోలీసులు పహారా కాశారు. నుహ్ జిల్లాలో ఉన్న 8 పోలీసు స్టేషన్లలో ఛార్జ్ తీసుకోవాలని ఐపీఎల్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఖేడ్లా గ్రామంలో ప్రస్తుతం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అరెస్టుల నుంచి తప్పించుకునేందకు ఆందోళనకారులు సమీప పర్వతాలవైపు పరారీ అయినట్లు తెలుస్తోంది. అందుబాటులో ఉన్న వీడియోల ఆధారంగా నిందితుల్ని అరెస్టు చేస్తున్నట్లు ఎస్పీ నరేంద్ర బిజర్నియా తెలిపారు. గురుగ్రామ్‌లోని సెక్టార్ 57లో ఉన్న ఓ మతపరమైన బిల్డింగ్‌కు నిప్పుపెట్టారు. ఆ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి.
సోమవారం వీహెచ్‌పీ ర్యాలీని నుహ్ జిల్లాలో ఓ వర్గం వారు అడ్డుకున్నారు. ఆ సమయంలో ఘర్షణ తలెత్తింది. ఆ దాడుల్లో ఇద్దరు హోంగార్డులు మృతిచెందారు. మరో 15 మంది గాయపడ్డారు. ఇరు వర్గాల వాళ్లు రాళ్లు రువ్వుకున్నారు, కార్లకు నిప్పుపెట్టారు. నుహ్ జిల్లాలో శాంతి భద్రత స్థాపన కోసం 20 కంపెనీల రాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు కావాలంటూ కేంద్రాన్ని హర్యానా సర్కార్ కోరింది. సోహ్నా, మనేశ్వర్, పటౌడి ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. హర్యానా హింసకు చెందిన ఘటనల్లో పోలీసులు 20 కేసుల్ని నమోదు చేశారు. ఇప్పటి వరకు మృతుల సంఖ్య నాలుగుకు చేరుకున్నది. తాజాగా గురుగ్రామ్‌లో మసీదుపై దాడి జరిగినట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

