Tejashwi Yadav | పాట్నా : ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఎట్టకేలకు గెలిచారు. 11 వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ యాదవ్పై తేజస్వీ యాదవ్ విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ఆధిక్యంలో కొనసాగిన తేజస్వీ.. ఆ తర్వాత వెనుకంజలో ఉన్నారు. చివరకు ఎట్టకేలకు విజయం వరించింది. తాజా గెలుపుతో తేజస్వీ యాదవ్ వరుసగా మూడోసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. తేజస్వీ యాదవ్కు 1,19,780 ఓట్లు పోలయ్యాయి.
ఇవాళ ఉదయం తేజస్వీ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. బీహార్లో మహాగఠ్బంధన్ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు తప్పకుండా మార్పును కోరుకుంటున్నారు.. ఇది ప్రజల విజయం. మేం తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తేజస్వీ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. కానీ ఫలితాలు తలకిందులయ్యాయి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళ్లింది.