Heart Attack | న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ఉద్యోగంలో తీవ్ర పని ఒత్తిడి ఎంతమాత్రమూ మంచిది కాదని, పురుషుల్లో గుండె జబ్బుల బారినపడే ముప్పు 103 శాతం పెంచుతుందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. కేవలం గుండె జబ్బులే కాదు వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, ఊబకాయం, స్ట్రోక్బారిన పడే ప్రమాదముందని పరిశోధకులు తెలిపారు. గుండె రక్తనాళాల్లో సమస్యలు ఏర్పడతాయని సర్వే పేర్కొన్నది. సైంటిస్టులు 18 ఏండ్లపాటు (2000 నుంచి 2018 వరకు) 6,465 మంది వైట్ కాలర్ ఉద్యోగులపై పరిశోధన జరిపి పై విషయాల్ని వెల్లడించారు.