సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఎల్పీజీ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు.
హైదరాబాద్, మార్చి14 (నమస్తే తెలంగాణ): ఎల్పీజీ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. సచివాలయంలో ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్‌తో శనివారం ఆయన ప్రత్యేక భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్‌కు వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ముందస్తు భయాందోళనతోనే బుకింగ్స్ రెట్టింపయ్యాయని తెలిపారు. పౌరసరఫరాల శాఖ భవన్లో కమాండ్ కంట్రోల్ రూమ్‌తోపాటు, ఫిర్యాదుల స్వీకరణకు1800-428-00-333 టోల్ ఫ్రీ నంబర్, పరిస్థితుల పర్యవేక్షణకు హైలెవల్ కమిటీని ఏర్పాటు చేశామని వివరించారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరా 20 శాతానికే అందుతున్నదని, గృహ వినియోగదారులకు సరఫరా నిలకడగా సాగేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు.
అదనంగా కమర్షియల్ సిలిండర్లు ఇవ్వండి
రాష్ర్టానికి అదనంగా కమర్షియల్ సిలిండర్లు కేటాయించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం శనివారం లేఖ రాసింది. డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్‌కు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. బ్లాక్ మార్కెట్‌కు సిలిండర్లను తరలిస్తే సహించేది లేదని పేర్కొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

