Kolkata | పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతా (Kolkata)లో ఆర్జీకార్ వైద్యురాలి ( RG Kar doctor) హత్యాచార ఘటన జరిగి నేటికి ఏడాది. ఈ సందర్భంగా ఆందోళనకారులు శనివారం కోల్‌కతాలో నబన్నా అభియాన్ పేరుతో మార్చ్ నిర్వహించారు. బెంగాల్ సచివాలయం నబన్నా (Nabanna) వరకూ ర్యాలీ తీశారు. అయితే, ఈ ర్యాలీ ఘర్షణకు దారి తీసింది. నిరసనకారులు బారికేడ్లను బద్దలు కొట్టి ఆంక్షల వలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీ ఛార్జి (lathi-charge) చేశారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది.
#WATCH | Kolkata, West Bengal: RG Kar Medical College rape and murder victim’s parents participate in the ‘Nabanna Abhiyan’ rally.
The rally has been called to mark the one-year anniversary of the RG Kar Medical College rape and murder. pic.twitter.com/uHwsDxYcw6
— ANI (@ANI) August 9, 2025
ఈ ర్యాలీలో బాధితురాలి తల్లిదండ్రులు, బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సువేందుకు అధికారి సహా పలువురు బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నారు. అయితే, పోలీసుల దాడిలో బాధితురాలి తల్లి కూడా గాయపడ్డారు. పోలీసులు లాఠీ ఛార్జి చేయడంతో బాధితురాలి తల్లిదండ్రులు గాయపడినట్లు సువేందు అధికారి తెలిపారు. మరోవైపు తనపై దాడి చేసి తన గాజులను విరిచారని బాధితురాలి తల్లి ఆరోపించింది. ‘పోలీసుల నన్నుకొట్టారు. నా గాజులు విరిచారు. వారు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు..? మాకు కావాల్సింది సచివాలయానికి వెళ్లి… నా కుమార్తెకు న్యాయం చేయమని అడగడం మాత్రమే’ అని ఆమె తెలిపారు.
కాగా, 2024 ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీకార్ ఆసుపత్రిలో (RG Kar Medical College) సెమినార్ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కాగా ఆర్జీకార్ దవాఖాన డాక్టర్లు, వైద్య విద్యార్థులు సుదీర్ఘకాలం ఆందోళనలు నిర్వహించారు. ఘటన అనంతరం ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సంజయ్‌ను ఆగస్టు 10న కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసును సీబీఐ విచారించింది. ప్రధాన నిందితుడిగా సంజయ్ రాయ్ పేరును ఛార్జ్‌షీట్‌లో చేర్చి కోర్టుకు సమర్పించింది. దీనిపై విచారణ జరిపిన కోల్‌కతాలోని సీల్దా కోర్టు.. సంజయ్ రాయ్‌ని దోషిగా నిర్ధారించింది. ఈ మేరకు దోషికి జీవితఖైదు విధించింది. అయితే, దోషికి ఉరిశిక్ష విధించాలంటూ బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.
Also Read..
Indian Railways | గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. రిటర్న్ టికెట్‌పై 20% డిస్కౌంట్
Air Force Chief | ఆపరేషన్ సిందూర్‌లో ఐదు పాక్ యుద్ధ విమానాలను కూల్చేశాం : ఎయిర్ ఫోర్స్ చీఫ్