Nehru letters | భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రాసిన లేఖల (Nehru letters) విషయంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి (Rahul Gandhi) కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. నెహ్రూ రాసిన లేఖలను తిరిగి అప్పగించాలని ప్రధానమంత్రి సంగ్రహాలయం కోరింది. 2008లో ఆ లేఖలను సోనియా గాంధీ (Sonia Gandhi) తీసుకెళ్లినట్లు పేర్కొంది. వాటిని తిరిగి అప్పగించే విషయంలో సహకరించాలని లేఖలో విజ్ఞప్తి చేసింది.
చరిత్రక ప్రాముఖ్యత కలిగిన నెహ్రూ లేఖలను జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ 1971లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీకి అప్పగించింది. అయితే 2008లో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆ లేఖలను సోనియా గాంధీకి పంపారు. అప్పటి నుంచి అవి సోనియా వద్దే ఉన్నాయి. ఆ లేఖలను తిరిగి అప్పగించాలని ఈ ఏడాది సెప్టెంబర్లోనే ప్రధాన మంత్రి లైబ్రరీ కోరింది. దీనిపై స్పందించకపోవడంతో రాహుల్ గాంధీకి డిసెంబర్ 10న మరోసారి లేఖ రాసింది. కనీసం ఫొటో కాపీలు లేదా డిజిటల్ కాపీలైనా అందజేయాలని అందులో కోరింది.
Also Read..
Jamili Elections | రేపు లోక్సభ ముందుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు..!
Constitution Debate | రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ ప్రారంభం
Gukesh | చాంపియన్ ట్రోఫీతో స్వదేశంలో అడుగుపెట్టిన గుకేశ్