Gukesh | ప్రపంచ చెస్ చాంపియన్‌గా 18 ఏళ్ల గుకేశ్ (Chess Champion Gukesh) అవతరించిన విషయం తెలిసిందే. సింగపూర్‌లో జరిగిన ఫిడే వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌లో చైనా క్రీడాకారుడు డింగ్ లిరెన్‌ను ఓడించి అతను విశ్వ విజేతగా నిలిచాడు. ఆ టైటిల్‌ను అందుకున్న అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలో గుకేశ్ తాజాగా స్వదేశానికి చేరుకున్నారు.
#WATCH | Tamil Nadu: World Chess Champion #GukeshD returns to the country, days after winning 2024 FIDE World Championship in Singapore and becoming the youngest-ever World Chess Champion.
Visuals from Chennai Airport. pic.twitter.com/G3qXdKnETi
— ANI (@ANI) December 16, 2024
ఇవాళ ఉదయం తమిళనాడు రాజధాని చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా గుకేశ్‌కు ఘన స్వాగతం లభించింది. పాఠశాల విద్యార్థులు, అధికారులు గుకేశ్‌ను ఘనంగా స్వాగతించారు. భారత జెండాలు ప్రదర్శిస్తూ పూల వర్షంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గుకేశ్ మాట్లాడుతూ.. తనకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
#WATCH | Chennai, Tamil Nadu: World Chess Champion #GukeshD says, “I am very glad to be here. I could see the support that and what it means to India…You guys are amazing. You gave me so much energy…” pic.twitter.com/iuFXDiLcjx
— ANI (@ANI) December 16, 2024
Also Read..
“Gukesh Dommaraju | ఆశలు లేని స్థితి నుంచి అద్భుతాన్ని సృష్టించి.. వరల్డ్ చాంపియన్‌గా గుకేశ్”
“Chess Champion Gukesh: ట్రోఫీని టచ్ చేయని ప్రపంచ చెస్ చాంపియన్ గుకేశ్.. వీడియో”
“World Chess Champion Gukesh: గుకేశ్‌కు 5 కోట్ల క్యాష్‌ప్రైజ్ ప్రకటించిన సీఎం స్టాలిన్”