న్యూఢిల్లీ: ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) తర్వాత నాలుగు రాష్ర్టాల్లో సుమారు 22.55 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం(ఈసీ) ఓటర్ల జాబితా నుంచి తొలగించింది. తొలగించిన ఓట్లు ఆ నాలుగు రాష్ర్టాల్లోని మొత్తం ఓట్లలో(3.68 కోట్లు) 6.12 శాతంగా ఉన్నాయి.
ఒడిశా, మణిపూర్, మిజోరాం, సిక్కిం రాష్ర్టాల ముసాయిదా ఓటర్ల జాబితాను ఈసీ ఆదివారం ప్రచురించింది. మరణం, శాశ్వత చిరునామా మార్పు, బహుళ ప్రాంతాల్లో ఓటరుగా నమోదు తదితర కారణాల వల్ల 22.55 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్టు ఈసీ తెలిపింది.