Heavy Rains | గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains)తో తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం అతలాకుతలమవుతోంది. పది రోజుల కిందట మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా వరదలు సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి రాష్ట్రాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో గత మూడు రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలకు జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది.
తాజాగా కురిసిన భారీ వర్షాలకు తిరునల్వేలి (Tirunelveli), తూత్తుకుడి (Thoothukudi) తదితర ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఆ ప్రాంతాల్లో కనుచూపు మేర వరదనీరే కనిపిస్తోంది. ప్రధాన రహదారులు, కాలనీలు అన్నీ వరద నీటితో నదులను తలపిస్తున్నాయి. ప్రజలు బయటకు రాలేని పరిస్థితి. దీంతో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఆహార పొట్లాలు, నిత్యవసర సరకులు అందిస్తున్నారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను హెలికాప్టర్ల ద్వారా రక్షిస్తున్నారు. తూత్తుకుడిలో వరద ప్రభావి ప్రాంతాల్లో సీఎం ఎంకే స్టాలిన్, డీఎంకే ఎంపీ కనిమొళి పర్యటించారు. ఆ ప్రాంతంలోని వరద పరిస్థితిన అధికారులను అడిగి తెలుసుకున్నారు.
#WATCH | Relief and rescue work continues in flood-ravaged area of Aeral in Thoothukudi district of Tamil Nadu pic.twitter.com/lpB45llaks
— ANI (@ANI) December 21, 2023
#WATCH | Tamil Nadu: DMK MP K Kanimozhi took stock of the flood situation in the Eral area in Thoothukudi district. pic.twitter.com/QtY6TaemxO
— ANI (@ANI) December 21, 2023
#WATCH | Tamil Nadu CM MK Stalin arrives in Thoothukudi. He will visit the flood-affected areas here and take stock of the situation. pic.twitter.com/a8aWOILMix
— ANI (@ANI) December 21, 2023
#WATCH | NDRF personnel distribute relief material in the flood-affected area of Thoothukudi in Tamil Nadu pic.twitter.com/s7RGV9nLVd
— ANI (@ANI) December 21, 2023
#WATCH | Waterlogging persists in parts of Palayamkottai of Tirunelveli city following heavy rainfall #TamilNadu pic.twitter.com/BmOibvWOdJ
— ANI (@ANI) December 21, 2023
Also Read..
Opposition MPs | సస్పెన్షన్‌పై ప్రతిపక్ష ఎంపీల నిరసన ప్రదర్శన
Ponmudy | అవినీతి కేసులో తమిళనాడు మంత్రి పొన్ముడికి మూడేళ్లు జైలు శిక్ష
Twitter | ఎక్స్‌లో పోస్టులు మాయం.. గందరగోళానికి గురవుతున్న యూజర్లు