Twitter | అమెరికన్ టైకూన్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ( Elon Musk) ఆధీనంలోని ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ (ఎక్స్) ఇటీవలే మాటిమాటికీ సతాయిస్తోంది. ఏదో ఒక సమస్యతో యూజర్లను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇటీవలే ట్విట్టర్ సేవల్లో అంతరాయం ఏర్పడటం.. లాగిన్‌లో సమస్యలు వంటివి తలెత్తిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఎక్స్‌లో ఇలాంటి సమస్యే తలెత్తింది.
అయితే, ఈ సారి ట్వీట్స్ మాయం అయ్యాయి (posts not loading). దీంతో యూజర్లు ఒకింత గందరగోళానికి గురవుతున్నారు. గురువారం ఉదయం నుంచి దేశ ప్రధాని మోదీ సహా చాలా మంది ట్విట్టర్ పోస్టులు కనిపించడం లేదు. ఆయా ఖాతాల్లోని పోస్టులు లోడ్ అవ్వడం లేదు. పోస్టులు మాయం అవ్వడంతో యూజర్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఏం జరిగిందో అర్థం కాక ఆందోళనకు గురవుతున్నారు. అయితే, ఈ సమస్యపై ఎక్స్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
Also Read..
Air India | విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్లు అలర్ట్.. తర్వాత ఏమైందంటే..?
Parliament breach | లోక్‌సభలో భద్రతా వైఫల్యం.. పోలీసుల అదుపులో మాజీ పోలీసు ఉన్నతాధికారి కుమారుడు