న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కావొచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జూలై 3 వరకు సాగే ఈ సమావేశాల్లో మొదటి రెండు రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ నెల 26న స్పీకర్ ఎన్నిక ఉంటుందని చెప్తున్నారు.
సభాపతి పదవి తమకు ఇవ్వాలని అధికార బీజేపీ మిత్ర పక్షాలైన టీడీపీ, జేడీయూ పట్టుబడుతున్నాయి. బీజేపీ ఎంపీ పురంధేశ్వరి, టీడీపీ ఎంపీ హరీశ్ మాథుర్ స్పీకర్ రేసులో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి.