Prajwal Revanna | మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపుల (sex tapes case) ఆరోపణలతో అరెస్టైన జనతాదళ్ (సెక్యులర్) నేత, హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ Prajwal Revanna)కు బెంగళూరు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ (judicial custody) విధించింది. జూన్ 24 వరకూ కస్టడీ విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సోమవారం ఉదయం స్పాట్ విచారణను పూర్తి చేయడంతో తదుపరి కస్టడీని కోరలేదు.
మరోవైపు ఈ కేసులో ఆధారాల సేకరణపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దృష్టి సారించింది. ఈ మేరకు శనివారం హోలోనర్సిపూర్ ఉన్న ప్రజ్వల్ ఇంట్లో సిట్ అధికారులు పలు ఆధారాలు సేకరించారు. ఆ సమయంలో సిట్ అధికారుల వెంట ప్రజ్వల్ కూడా ఉన్నారు. కాగా, సొంత ఊరికి ప్రజ్వల్‌ను తీసుకువెళ్లిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పో లీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మీడియాను సైతం అనుమతించలేదు.
Also Read..
Gold Seized | ముంబై, చెన్నై ఎయిర్‌పోర్టుల్లో భారీగా బంగారం పట్టివేత
Indian origin | కెనడాలో భారత సంతతి యువకుడు దారుణ హత్య
Rashtrapati Bhavan | ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో అనుకోని అతిథి కదలికలు.. అది చిరుతపులేనా..?