Gold Seized | ముంబై, చెన్నై ఎయిర్‌పోర్టుల్లో భారీగా బంగారం పట్టివేత
Gold Seized | దేశంలో భారీగా బంగారం పట్టుబడింది (Gold Seized). రెండు వేర్వేరు విమానాశ్రయాల్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.27 కోట్ల విలువైన 45 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సోమవారం సీజ్ చేశారు.
Gold Seized | దేశంలో భారీగా బంగారం పట్టుబడింది (Gold Seized). రెండు వేర్వేరు విమానాశ్రయాల్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.27 కోట్ల విలువైన 45 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సోమవారం సీజ్ చేశారు. ఈ మేరకు రెండు ఘటనల్లో పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ముందుగా చెన్నై ఎయిర్పోర్ట్ (Chennai airport)లో 13 కేజీల 24 క్యారెట్ల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్పోర్ట్ డిపార్చర్ గేట్ వద్ద సోదాలు నిర్వహించి కస్టమ్స్ అధికారులు.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కస్టమర్ సపోర్ట్ స్టాఫ్ (customer support staff for IndiGo Airlines)గా పనిచేస్తున్న మహ్మద్ బర్కతుల్లా వద్ద 13 కేజీల బంగారాన్ని గుర్తించారు. అతని వద్ద నుంచి పేస్ట్ రూపంలో ఉన్న 36 పౌచులను స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన బంగారం విలువ రూ.8.04 కోట్లుగా అంచనా వేశారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు, విమానాశ్రయ సిబ్బంది, ట్రాన్సిట్ ప్యాసింజర్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ బర్కతుల్లా కొలంబో వెళ్లే ప్రయాణికుల నుంచి పౌచ్‌లను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు విదేశీ మహిళా ప్రయాణికుల నుంచి 32.79 కిలోల బంగారం పట్టుబడింది. లోదుస్తులు, బ్యాగుల్లో దాచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించిన కస్టమ్స్ అదికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.19.15 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఇద్దరు ప్రయాణికుల్ని అరెస్ట్ చేసినట్లు ముంబై కస్టమ్స్ (Mumbai Customs) అధికారులు తెలిపారు.
Airport Commissionerate, Mumbai Customs Zone seized 32.79 Kgs of gold valued at Rs. 19.15 Cr. Gold was found concealed in the undergarments and baggage of two woman passengers of foreign nationality. Both the passengers were arrested: Mumbai Customs pic.twitter.com/X8uSQyB7se
— ANI (@ANI) June 10, 2024
Also Read..
Rashtrapati Bhavan | ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో అనుకోని అతిథి కదలికలు.. అది చిరుతపులేనా..?
Bye Elections | 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం
Chandra Sekhar Pemmasani: మోదీ సర్కారులో అత్యంత సంపన్న మంత్రి ఎవరో తెలుసా?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

