Ayodhya Temple : 2023 నాటికి భక్తులకు అందుబాటులోకి అయోధ్య మందిరం
Ayodhya Temple : అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామ మందిరాన్ని 2023 డిసెంబర్ నాటికి భక్తుల కోసం తెరువనున్నట్లు సమాచారం. 2025 సంవత్సరం నాటికి అయోధ్యలో మొత్తం రామాలయ సముదాయాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి

లక్నో : అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామ మందిరాన్ని (Ayodhya Temple) 2023 డిసెంబర్ నాటికి భక్తుల కోసం తెరువనున్నట్లు సమాచారం. 2025 సంవత్సరం నాటికి అయోధ్యలో మొత్తం రామాలయ సముదాయాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. దేవాలయ సముదాయంలో మ్యూజియం, డిజిటల్ ఆర్కైవ్, పరిశోధనా కేంద్రం కూడా అందుబాటులోకి రానున్నాయి. ముందుగా 2024 లో పార్లమెంట్ ఎన్నికలకు ముందు అయోధ్యలోని రామ జన్మభూమిలో ఆలయ నిర్మాణం పూర్తవుతుందని నివేదించబడింది. ఆలయ స్థలంలో ఫౌండేషన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ అక్టోబర్ నాటికి ఫౌండేషన్ పనుల నిర్మాణం పూర్తయి.. మొదటి అంతస్తు పనులు ప్రారంభం కానున్నాయి.
రామజన్ణం భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ప్రకారం, ఫౌండేషన్ పనుల్లో మూడు వేర్వేరు ప్రదేశాల నుంచి రాళ్లు ఉపయోగిస్తున్నారు. వీటిలో మీర్జాపూర్, రాజస్థాన్‌కు చెందినవి కూడా ఉండనున్నాయి. యంత్రాల ద్వారా 70 శాతానికి పైగా పనులు జరుగుతున్నాయని, అందువల్ల నిర్మాణ కార్యకలాపాలపై కొవిడ్ సంక్షోభం ప్రభావం లేదని ఆయన చెప్పారు. 12 గంటల చొప్పున రెండు షిఫ్టుల్లో పనులు జరుగుతున్నాయి. నేషనల్ జియో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) గువాహటి నుంచి నిపుణులు ఆలయ నిర్మాణంలో సలహాలు ఇస్తున్నట్లు చంపత్ రాయ్ తెలిపారు. 2024 నాటికల్లా మొత్తం ఆలయం నిర్మాణ పనులు పూర్తిచేయాలని కన్స్ట్రక్షన్ కమిటీ లక్ష్యంగా పెట్టుకున్నది. తొలి విడత నిర్మాణం పనులు వచ్చే ఏడాది కల్లా పూర్తి చేయనున్నారు. సవరించిన విస్తరణ ప్రణాళిక ప్రకారం, ఇప్పుడు ఆలయం నిర్మాణ పనులు 70 ఎకరాలకు బదులుగా 107 ఎకరాల్లో జరుగనున్నాయి. వసతుల సముదాయం, నివాస ప్రాంతం వంటి మరికొన్ని పనులు కూడా చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రైవేట్ యజమానుల నుంచి భూమి కొనుగోలు చేయనున్నారు. ఇటీవల ఆలయ ట్రస్ట్ రూ.1 కోటి చెల్లించి సమీపంలోని 7,285 చదరపు అడుగుల భూమిని కొనుగోలు చేసింది.
ఇవి కూడా చదవండి..
ఓనమ్‌కు ఆంక్షలు సడలించి పినరయి ప్రభుత్వం
రూ.6,504 కోట్ల లాభాన్ని ఆర్జించిన ఎస్బీఐ
అనాథల సంక్షేమ చట్టాల అమలు చూడండి: వెంకయ్యనాయుడు
ముక్కులో వెంట్రుకలు కట్ చేయొద్దా..? ఎందుకు..?
ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఉచితం
బిల్లుకు మద్దతు తెలిపి ఇప్పుడు ఆందోళనలా?
రక్షణ మంత్రి టార్గెట్‌గా కార్ బాంబు దాడి
ఆసియా తొలి న్యూక్లియార్ రియాక్టర్ ప్రారంభం
రానున్న ఐదేండ్లలో లక్ష దాటనున్న బంగారం ధర
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

