Jamili Elections | జమిలిపై నేడు కోవింద్ కమిటీ నివేదిక.. రాజ్యాంగంలోని ఐదు అధికరణల సవరణకు సిఫార్సు?
దేశంలో ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాల్టీ, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గల సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ గురువారం నివేదిక సమర్పించనున్నట్టు తెలిసింది.
Jamili Elections | న్యూఢిల్లీ, మార్చి 13: దేశంలో ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాల్టీ, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గల సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ గురువారం నివేదిక సమర్పించనున్నట్టు తెలిసింది. ఒకే దేశం-ఒకే ఎన్నిక నినాదంతో జమిలి ఎన్నికల నిర్వహణ మనదేశంలో ఎంతవరకు సాధ్యం, ఇతర అంశాలపై వివిధ వర్గాల నుంచి సమాచారం, అభిప్రాయాలు సేకరించిన కోవింద్ కమిటీ గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి నివేదిక సమర్పిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.
జమిలి ఎన్నికలకు రాజ్యాంగంలోని ఆఖరి ఐదు అధికరణలను సవరించాలని కమిటీ సూచించినట్టు తెలిసింది. అంతేకాకుండా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు ఒకే ఓటరు లిస్టు ఉంచే విషయంపై కూడా కమిటీ దృష్టి సారించింది. ఇప్పటికే దేశంలోని పలు అధికార, విపక్ష పార్టీల నుంచి, లా కమిషన్, ఇతర ముఖ్య సంస్థల నుంచి ఈ కమిటీ అభిప్రాయాలను సేకరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

