Rajnath Singh | త్రివిధ దళాధిపతులతో (military chiefs) కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) కీలక భేటీ నిర్వహించారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి సీడీఎస్ అనిల్ చౌహాన్‌తోపాటు ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, వైస్ ఎయిర్ చీఫ్, రక్షణ కార్యదర్శి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణ, ఆపరేషన్ సిందూర్, సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులపై అధికారులతో రాజ్‌నాథ్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)తో అన్ని విధాలుగా దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో పలు దేశాల సైనిక రాయబారులకు కేంద్రం ఇవాళ ప్రత్యేక బ్రీఫింగ్ ఇవ్వనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ఢిల్లీలోని రక్షణ శాఖ కార్యాలయంలో కీలక భేటీ జరగనుంది. ఇందులో ‘ఆపరేషన్ సిందూర్’కు సంబంధించిన ముఖ్య వివరాలను ఆయా దేశాల ప్రతినిధులతో పంచుకోనుంది. ఈ బ్రీఫింగ్‌కు ముందు త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ భేటీ నిర్వహించి.. ఆయా అంశాలపై చర్చలు జరుపుతున్నారు.
Also Read..
Encounter | జమ్ము కశ్మీర్లో ఎదురుకాల్పులు.. లష్కరే ఉగ్రవాది హతం
Blasts | రెండు రోజుల్లో బాంబు పేలుళ్లు.. ముంబై పోలీసులకు బెదిరింపు మెయిల్
Schools reopen | కశ్మీర్లో తెరుచుకున్న పాఠశాలలు