Blasts | పాక్‌తో ఉద్రిక్తతల వేళ దేశంలో బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే పలు క్రికెట్ స్టేడియాలకు, విమానాలకు, ఎయిర్‌పోర్ట్‌లకు ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర పోలీసు కంట్రోల్ రూమ్ (Maharashtra Police Control Room)కు బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపుతోంది.
ముంబై నగరంలో రెండు రోజుల్లో భారీ పేలుళ్లు (Bomb Blasts) జరుగుతాయని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు మంగళవారం ఉదయం మహారాష్ట్ర పోలీసు కంట్రోల్ రూమ్‌కు మెయిల్ పంపారు. ఈ హెచ్చరికలను తేలికగా తీసుకోవద్దని అందులో పేర్కొన్నారు. అయితే, అందులో డేట్, టైమ్, ప్లేస్ మెన్షన్ చెయ్యలేదు. ఈ బెదిరింపులతో అప్రమత్తమైన అధికారులు ఈ మెయిల్‌ను ముంబై పోలీసులకు ఫార్వర్డ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ మెయిల్‌ను ఎవరు పంపారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రెస్ ద్వారా మెయిల్ పంపిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read..
Schools reopen | కశ్మీర్లో తెరుచుకున్న పాఠశాలలు
Floods | వరద బీభత్సం.. 100 మందికిపైగా మృతి