Floods | మధ్య ఆఫ్రికా దేశమైన కాంగో (Congo)లో వరదలు (Floods) బీభత్సం సృష్టించాయి. సుడ్కివు ప్రావిన్స్ (Sud Kivu province)లోని కసబా గ్రామాన్ని (Kasaba village) భారీ వర్షాలు కుదిపేశాయి. ఈ వర్షాలకు వరదలు సంభవించినట్లు ప్రాంతీయ అధికారి బెర్నార్డ్ అకిలి తెలిపారు. దాదాపు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.
కుండపోత వర్షం కారణంగా కసబా నది అంచనాలకు మించి ప్రవహించినట్లు చెప్పారు. నదిలో ప్రవాహం ఎక్కువై వరద సమీప గ్రామాన్ని ముంచెత్తింది. ఈ వరదలకు 150కిపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఈ ప్రకృతి ప్రకోపానికి వంద మందికిపైగా ప్రజలు నిద్రలోనే జలసమాధి అయ్యారు. మరణించిన వారిలో ఎక్కువగా చిన్న పిల్లలు, వృద్ధులే ఉన్నట్లు సదరు అధికారి వెల్లడించారు. దాదాపు 28 మంది గాయపడ్డారు. ఇప్పటి వరకూ 120 మృతదేహాలను లభ్యమైనట్లు స్థానిక అధికారి తెలిపారు.
Also Read..
Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం
China | పాక్కు మేం ఆయుధాలు పంపుతలేం.. ఇంటర్నెట్లో ప్రచారాన్ని కొట్టిపారేసిన చైనా