Accident | అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతులను న్యూయార్క్‌లోని క్లీవ్‌ల్యాండ్ యూనివర్సిటీలో చదువుతున్న మానవ్ పటేల్ (20), సౌరవ్ ప్రభాకర్(23)గా గుర్తించారు. ఈ ఘటనపై న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ సంతాపం వ్యక్తం చేసింది.
పెన్సిల్వేనియాలో మే 10వ తేదీన మానవ్ పటేల్, సౌరవ్ ప్రభాకర్, మరో విద్యార్థి కలిసి కారులో బయటకు వెళ్లినప్పుడు ప్రమాదం జరిగింది. వీరి కారు వంతెనను ఢీకొట్టగా కారు నడుపుతున్న ప్రభాకర్, వెనుక సీటులో కూర్చున్న మానవ్ పటేల్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ముందు సీటులో కూర్చున్న మరో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.