Constitution Debate | భారత రాజ్యాంగాన్ని (Constitution) ఆమోదించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చ జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా లోక్‌సభలో (Lok Sabha) శుక్రవారం ఉదయం జీరో అవర్ ముగిసిన తర్వాత చర్చ ప్రారంభమైంది (Constitution Debate). రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగువ సభలో రాజ్యాంగంపై చర్చను ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. దేశాన్ని ఐక్యంగా, ప్రజాస్వామ్యంగా, స్వావలంబనగా ఉంచేందుకు రాజ్యాంగం ఓ రోడ్‌మ్యాప్‌గా ఉపయోగపడుతుందని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి నైతిక దిక్సూచి అని, ప్రతి వ్యక్తికి బలమైన గుర్తింపును అందిస్తుందని పేర్కొన్నారు. అయితే, ప్రతిపక్షాలు అనేక సందర్భాల్లో రాజ్యాంగాన్ని అవమానించాయని మండిపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని అనేక కీలక పథకాలను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. కాగా, శనివారం వరకూ ఈ చర్చ కొనసాగుతుంది. సభ్యులు దీనిపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఇక చర్చకు ముగింపుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రేపు సమాధానం ఇవ్వనున్నారు.
#WATCH | Defence Minister Rajnath Singh initiates the debate on the Constitution in the Lok Sabha
The debate marks the 75th anniversary of the Constitution’s adoption.
(Source: Sansad TV) pic.twitter.com/NnkFuE2pvF
— ANI (@ANI) December 13, 2024
Also Read..
Nirmala Sitharaman | అత్యంత శక్తిమంతమైన మహిళగా నిర్మలా సీతారామన్.. వరుసగా ఆరోసారి చోటు
RBI | ఆర్బీఐ కార్యాలయానికి బాంబు బెదిరింపులు.. రష్యన్ భాషలో మెయిల్