Elon Musk | అప్పట్లో బట్టలు కూడా కొనలేని పరిస్థితి.. మస్క్ రోజూ ఒకే సూట్‌తోనే ఉద్యోగానికి వెళ్లేవాడు : మాయే మస్క్
Elon Musk | బిలియనీర్, అమెరికన్ టైకూన్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) ఒకానొక సమయంలో ఉద్యోగానికి వెళ్లడానికి సరైన దుస్తులు కూడా లేక ఒకే సూట్‌నే రోజూ వేసుకునేవాడట (Musk wore same suit everyday).
Elon Musk | బిలియనీర్, అమెరికన్ టైకూన్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) అరుదైన రికార్డు సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ కుబేరుడిగా విరాజిల్లుతున్న మస్క్.. ఓ అరుదైన ఘనతను సాధించారు. మస్క్ సంపద ఏకంగా 400 బిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. తద్వారా ప్రపంచంలోనే తొలిసారి ఈ రికార్డు నెలకొల్పిన వ్యక్తిగా నిలిచారు. అయితే, ఇప్పుడు ఇంత సంపదతో తొలి వ్యక్తిగా నిలిచిన మస్క్.. ఒకప్పుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారంట. ఒకానొక సమయంలో ఉద్యోగానికి వెళ్లడానికి సరైన దుస్తులు కూడా లేక ఒకే సూట్‌నే రోజూ వేసుకునేవాడట (Musk wore same suit everyday). ఈ విషయాన్ని మస్క్ తల్లి మాయే మస్క్ (Maye Musk) తాజాగా వెల్లడించారు.
ప్రస్తుతం మస్క్‌కు సంబంధించిన ఓ పాత ఫొటో వైరల్ అవుతోంది. ఆ ఫొటో 1990లోది. అందులో మస్క్ బ్లాక్ సూట్, వైట్ చొక్కా , టైతో కళ్లద్దాలు పెట్టుకుని కనిపించాడు. ఈ ఫొటోను రీట్వీట్ చేసిన మస్క్ తల్లి.. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ‘ఈ ఫొటో టొరంటోలో అద్దె ఇంట్లో ఉన్నప్పటిది. అప్పట్లో మస్క్ బ్యాంక్ ఉద్యోగానికి వెళ్లేవాడు. ఆ సమయంలో వేసుకోవడానికి దుస్తులు లేక 99 డాలర్లతో కొన్న ఈ ఒకే ఒక్క సూట్‌ని రోజూ వేసుకుని వెళ్లేవాడు. బ్యాంక్‌కు వెళ్లేముందు మా అమ్మ ఈ ఫొటో తీసింది’ అని మాయే మస్క్ తెలిపారు.
This photo was taken in our rent-controlled apartment in Toronto, with my mom‘s painting on the wall. The suit cost $99 which included a free shirt, tie and socks. A great bargain! He wore this suit every day to his bank job in Toronto. I couldn’t afford a second suit. We were… https://t.co/jh2SHOXwpe
— Maye Musk (@mayemusk) December 12, 2024
కాగా, దక్షిణాఫ్రికాకు చెందిన ఎరోల్ మస్క్‌ను మాయే మస్క్ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత విడాకులు తీసుకున్న మాయే.. ముగ్గురు పిల్లల్ని ఒంటరిగానే పెంచింది. సింగిల్ మదర్‌గా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. విడాకుల అనంతరం మస్క్ కుటుంబం మొదట దక్షిణాఫ్రికా నుంచి కెనడాకు వలస వెళ్లింది. అక్కడి నుంచి అమెరికాకు వచ్చి స్థిరపడింది. ఇక సింగిల్ మదర్‌గా తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ‘ఎ ఉమెన్ మేక్స్ ఎ ప్లాన్’ అనే పుస్తకంలో పొదుపరిచింది. అప్పట్లో తన పిల్లలకు మంచి బట్టలు కొనడానికి కూడా తన వద్ద డబ్బులు ఉండేవి కాదని తెలిపింది. దీంతో సెకండ్ హ్యాండ్ దుస్తులను కొనుగోలు చేసేవాళ్లమని వివరించింది. తినడానికి కూడా తిండిలేక బ్రెడ్, పీనట్ బటర్ వంటివే తినేవాళ్లమని, పిల్లలు కూడా తన పరిస్థితిని అర్థం చేసుకొని వాటినే ఇష్టంగా తినేవాళ్లని వివరించింది.
Also Read..
Elon Musk | ఒకే ఒక్కడు.. సంపదలో ఎలాన్ మస్క్ అరుదైన ఘనత
Nirmala Sitharaman | అత్యంత శక్తిమంతమైన మహిళగా నిర్మలా సీతారామన్.. వరుసగా ఆరోసారి చోటు
RBI | ఆర్బీఐ కార్యాలయానికి బాంబు బెదిరింపులు.. రష్యన్ భాషలో మెయిల్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

