RBI | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపుతున్నాయి. ఇవాళ ఉదయం ఢిల్లీలోని దాదాపు 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India)కు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
ముంబైలోని ఆర్బీఐ కార్యాలయాన్ని పేలుడు పదార్థాలతో పేల్చేస్తామంటూ శుక్రవారం ఓ మెయిల్ వచ్చింది. ఆర్బీఐ గవర్నర్ (RBI Governor) సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) అధికారిక ఈమెయిల్ ఐడీకి రష్యన్ భాషలో (Russian language) బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అప్రమత్తమైన ముంబై పోలీసులు ఆర్బీఐ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ మేరకు ఘటనపై పలు సెక్షన్ల కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read..
Bomb Threats | వారంలో రెండో సారి.. 16 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
Constitution Debate | నేడు లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ
IndiGo Passengers: ఇస్తాంబుల్‌లో చిక్కుకున్న 400 మంది ఇండిగో ప్రయాణికులు