Rajasthan | అప్పుల ఊబిలో రాజస్థాన్ విద్యుత్తు సంస్థలు.. కాంగ్రెస్ హయాంలో 90 వేల కోట్ల రుణాలు
‘తప్పులెన్నువారు..’ అంటూ వేమన చెప్పినట్టే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. తాము మొన్నటివరకూ పాలన చేసిన రాజస్థాన్‌లో విద్యుత్తు సంస్థలను అప్పులపాల్జేసి అక్కడ చీకట్లను మిగిల్చిన హస్తంపార్టీ.. తెలంగాణలో 24 గంటల నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేసిన బీఆర్ఎస్పై లేనిపోని నిందలు వేస్తున్నది. రాజస్థాన్‌లో ఐదేండ్ల కాంగ్రెస్ పాలనే దీనికి నిదర్శనం.
- బడ్జెట్లో మెజారిటీ వాటా ఇకపై మిత్త్తిలకే
- రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్‌లాల్ ఆందోళన
- కరెంటు సరఫరాపైనా తప్పుడు లెక్కలు
Rajasthan | హైదరాబాద్, జనవరి 10 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): ‘తప్పులెన్నువారు..’ అంటూ వేమన చెప్పినట్టే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. తాము మొన్నటివరకూ పాలన చేసిన రాజస్థాన్‌లో విద్యుత్తు సంస్థలను అప్పులపాల్జేసి అక్కడ చీకట్లను మిగిల్చిన హస్తంపార్టీ.. తెలంగాణలో 24 గంటల నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేసిన బీఆర్ఎస్పై లేనిపోని నిందలు వేస్తున్నది. రాజస్థాన్‌లో ఐదేండ్ల కాంగ్రెస్ పాలనే దీనికి నిదర్శనం.
అప్పుల కుప్ప
రాజస్థాన్‌లోని విద్యుత్తు కంపెనీలకు రూ. 90 వేల కోట్ల అప్పులు ఉన్నట్టు ఆ రాష్ట్ర సీఎం భజన్‌లాల్ శర్మ తెలిపారు. ఈ రుణాలను తీర్చడానికి, మిత్తిలు కట్టడానికే బడ్జెట్లో మెజారిటీ వాటాను కేటాయించాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్తు శాఖ పనితీరుపై సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని కోతలు లేని కరెంటు సరఫరాకు రోడ్డు మ్యాప్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరెంటు కష్టాలకు చెక్ పెట్టాలంటే పునరుత్పాదక శక్తి వనరుల వైపు దృష్టి సారించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
ట్రిక్కులు మానుకోవాలి
తక్కువ ధరకే ప్రజలందరికీ నాణ్యమైన నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేయాలని సీఎం ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. యాసంగి సీజన్ (రబీ సీజన్) రైతులకు ముఖ్యమైనదని, వారికి కూడా తగినంత విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేయాలని ఆదేశించారు. గత ఆగస్టులో రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన విద్యుత్తు కోతలు విధించడం తెలిసిందే. దీంతో సామాన్యులు, రైతులు, పారిశ్రామికవర్గాలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. అయితే, తమ ప్రభుత్వం కోతలకు పాల్పడలేదని అప్పటి సీఎం అశోక్ గెహ్లాట్, విద్యుత్తు శాఖాధికారులు మోసపుచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై తాజాగా స్పందించిన సీఎం భజన్‌లాల్.. విద్యుత్తు సరఫరాకు సంబంధించి వాస్తవ సమాచారాన్ని ఇవ్వాలన్నారు. విద్యుత్తు లెక్కలను తారుమారు చేసే ట్రిక్కులను మానుకోవాలని అధికారులకు హితవు పలికారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

