Loksabha Elections 2024 : ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఆకట్టుకునేలా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తుందని ఎందుకంటే ఆ పార్టీ అసలు హామీలను నెరవేర్చదని రాజస్ధాన్ సీఎం భజన్‌లాల్ శర్మ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలను గుప్పించి ఆపై వాటిని విస్మరిస్తుందని పేర్కొన్నారు. భజన్‌లాల్ శర్మ ముంబైలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ 2014. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నింటినీ నెరవేర్చిందని గుర్తుచేశారు.
2024లో పార్టీ వెల్లడించిన సంకల్ప పత్రంలో ఇచ్చిన వాగ్ధానాలను కూడా నూటికి నూరు శాతం అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ 50,60 ఏండ్లలో పూర్తి చేయలేని పనులను సైతం రాజస్ధాన్ బీజేపీ ప్రభుత్వం 90 రోజుల్లోనే పూర్తిచేసిందని సీఎం చెప్పుకొచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించి నరేంద్ర మోదీ తిరిగి మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడతారని శర్మ ధీమా వ్యక్తం చేశారు.
Read More :
Arvind Kejriwal | ఆప్ ఎమ్మెల్యేలతో అరవింద్ కేజ్రీవాల్ భేటీ.. కీలక ఎమ్మెల్యే మిస్సింగ్