Rain In Delhi | గత నాలుగు రోజులుగా తీవ్ర పొగమంచుతో ఉక్కిరిబిక్కిరి అయిన ఢిల్లీ వాసులకు ఇవాళ కాస్త ఉపశమనం లభించింది. సోమవారం ఉదయం రాజధాని నగరంలో తేలికపాటి వర్షం (Rain In Delhi) కురిసింది. దీంతో విజిబిలిటీ సాధారణ స్థాయికి చేరింది.
ఢిల్లీలోని నరేలా, బవానా, కంఝవాలా, జాఫర్పూర్, ఫిరోజ్‌షా రోడ్డు సహా పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం తేలికపాటి వర్షం కురిసింది. దీంతో నగర రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 9.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.
వర్షం కారణంగా వాతావరణం మారిపోయింది. మంచు నుంచి ఉపశమనం లభించింది. దీంతో విజిబిలిటీ సైతం మెరుగుపడింది. ఇవాళ ఉదయం ఢిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్పోర్ట్ రన్‌వేపై దృశ్యమానత 1,000 మీటర్ల నుంచి 2,000 మీటర్ల మధ్య ఉంది. ఈ కారణంగా విమాన కార్యకలాపాలకు ఎలాంటి ప్రభావం పడలేదు (flight operations normal). అయితే, శ్రీనగర్, పాట్నా, కోల్‌కతాలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన సర్వీసులపై ప్రభావం పడింది.
#WATCH | Delhi: Rain lashes several parts of the National Capital.
(Visuals from Firozeshah Road) pic.twitter.com/2fhyfwRxuW
— ANI (@ANI) January 6, 2025
Also Read..
Siddaramaiah | ఆరోపణలు చేస్తే సరిపోదు.. వాటిని నిరూపించాలి : కేంద్ర మంత్రికి కర్ణాటక సీఎం సవాల్
Justin Trudeau | కెనడా ప్రధాని సంచలన నిర్ణయం.. రాజీనామా యోచనలో ట్రూడో..!
HMPV | భారత్‌లో తొలి హెచ్‌ఎమ్‌పీవీ కేసు.. ఎనిమిది నెలల చిన్నారికి వైరస్ పాజిటివ్..!