ముంబై, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): దేశ ఆర్థిక రాజధాని ముంబైని వర్షాలు ముంచెత్తాయి. దీంతో విద్యాసంస్థలను మూసివేశారు. విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోకల్ ట్రైన్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడినట్టు అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్‌లపై పెద్ద ఎత్తున నీరు చేరటంతో సెంట్రల్ రైల్వే మార్గంలో సబర్బన్ రైలు సేవలు నిలిచిపోయాయి. మరో రెండు రోజులు ముంబైతోపాటు థాణె, రాయ్‌గఢ్, పాల్ఘర్, నాసిక్ ఘాట్ ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరాఠ్వాడలో వర్షాల కారణంగా ఆరుగురు మరణించారు.