న్యూఢిల్లీ, మే 2 : దేశ రాజధాని ఢిల్లీని వర్షం ముంచెత్తింది. భారీ వర్షానికి ఒక మహిళ, ముగ్గురు పిల్లలు మృతి చెందారు. అలాగే విద్యుదాఘాతానికి 25 ఏండ్ల యువకుడు మృతి చెందాడు. 200కు పైగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల చెట్లు నేలకూలాయి. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. 1901 తర్వాత మే నెలలో ఢిల్లీలో 24 గంటల వ్యవధిలో కురిసిన రెండో అతి పెద్ద వాన ఇదేనని అధికారులు తెలిపారు.