Cyclone Biparjoy | బిపర్జాయ్ ఎఫెక్ట్.. ఢిల్లీలో వర్షం
Cyclone Biparjoy | బిపర్జాయ్ తుపాను (Cyclone Biparjoy) ప్రభావం తాజాగా దేశరాజధాని ఢిల్లీ (Delhi)పై పడింది. తుపాను కారణంగా శుక్రవారం ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం (Rain) కురిసింది.
Cyclone Biparjoy | బిపర్జాయ్ తుపాను (Cyclone Biparjoy) ప్రభావం తాజాగా దేశరాజధాని ఢిల్లీ (Delhi)పై పడింది. తుపాను కారణంగా శుక్రవారం ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం (Rain) కురిసింది. బలమైన గాలులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రహదారులు నదులను తలపించాయి. వర్షం కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మరోవైపు నేడు ఢిల్లీలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ‘దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్, మాల్వియానగర్, కల్కాజీ, తుగ్లకాబాద్, ఛత్తర్ పూర్, దేరమాండి సహా ఎన్ సీఆర్ (నోయిడా, దాద్రీ, గ్రేటర్ నోయిడా) తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది. గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి’ అని ఐఎండీ తెలిపింది.
Ashram Flyover after 5 mins of rain. #DelhiRain pic.twitter.com/CgAgfSaHDr
— Samiran Mishra (@scoutdesk) June 16, 2023
Also Read..
Starbucks | స్టార్‌బక్స్ కు ఫెడరల్ జ్యూరీ షాక్.. ఆ ఉద్యోగికి రూ.210 కోట్లు చెల్లించాలంటూ ఆదేశం
Cyclone Biparjoy | రాజస్థాన్ కు భారీ వర్ష సూచన.. ఆరెంజ్ అలర్జ్ జారీ చేసిన ఐఎండీ
Upasana | నేను ప్రెగ్నెంట్ అని తెలియగానే చరణ్ అలా స్పందించాడు : ఉపాసన
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Cyclone Biparjoy
- Delhi
- NCR
- rain
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

