న్యూఢిల్లీ, మే 19: ఏసీ కోచ్ల సీట్లను భర్తీ చేయడానికి రైల్వే శాఖ కొత్త ప్రణాళికను రచించింది. ఒకవేళ ఏసీ కోచ్లలో సీట్లు ఖాళీ ఉంటే వాటిని స్లీపర్ క్లాస్ ప్యాసింజర్లతో (అప్గ్రేడ్ విధానం ద్వారా) భర్తీ చేయనున్నది.
రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు చార్ట్ సిద్ధం చేసేటప్పుడు ఈ భర్తీ ప్రక్రియను చేపట్టనున్నది. ఎవరైతే టికెట్ చార్జీ మొత్తం చెల్లిస్తారో వారికే అప్గ్రేడ్ వర్తిస్తుంది. రాయితీ టికెట్లకు వర్తించదు.