Bullet train station | దేశంలో తొలి బుల్లెట్ రైలు స్టేషన్ ఇదే.. వీడియో షేర్ చేసిన కేంద్ర మంత్రి
Bullet train station | దేశంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ గురించి కీలక సమాచారాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తాజాగా పంచుకున్నారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్‌లో తొలి బుల్లెట్ రైలు కోసం నిర్మించిన రైల్వేస్టేషన్ గ్లింప్స్‌ను ఆయన ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో షేర్ చేశారు.
Bullet train station | కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ముంబై-అహ్మదాబాద్ మధ్య భారతదేశపు మొట్టమొదటి అత్యాధునిక హైస్పీడ్ రైలు కారిడార్ (High Speed Rail corridor) నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2026 నాటికి ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో దేశంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ గురించి కీలక సమాచారాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తాజాగా పంచుకున్నారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్‌లో తొలి బుల్లెట్ రైలు కోసం నిర్మించిన రైల్వేస్టేషన్ గ్లింప్స్‌ను ఆయన ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో షేర్ చేశారు.
ఈ స్టేషన్‌ని మొత్తం 1,33,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ హబ్ భవనంలో కార్యాలయాలు, వాణిజ్య కేంద్రాలు, ప్రయాణికుల కోసం రిటైల్ స్టోర్స్ వంటివి ఏర్పాటు చేసుకునే విధంగా నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌లోని ఏకైక అండర్‌గ్రౌండ్ స్టేషన్ ఇదే కావడం విశేషం.
దేశంలోని రెండు ఆర్థిక నగరాలను కలుపుతున్న ఈ రైలు మార్గం 508 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. వీటిల్లో 448 కిలోమీటర్ల ప్రయాణం ఎత్తైన కారిడార్‌పై సాగుతుంది. 26 కిలోమీటర్ల మేర సొరంగాలు, 10 కిలోమీటర్ల మేర వంతెనలు, ఏడు కిలోమీటర్లు ఘాట్ మార్గాల్లో ఉంటుంది.
Terminal for India’s first bullet train!
📍Sabarmati multimodal transport hub, Ahmedabad pic.twitter.com/HGeoBETz9x
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 7, 2023
Also Read..
Rajinikanth | రజినీకాంత్ ఇంటిని చుట్టుముట్టిన వరద నీరు.. వీడియో
Mizoram | మిజోరం ముఖ్యమంత్రిగా లాల్దుహోమా ప్రమాణస్వీకారం
KCR | కేసీఆర్ కోలుకునేందుకు 8 వారాలు పడుతుంది.. యశోద ఆస్పత్రి వైద్యులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

