Mizoram | మిజోరం ముఖ్యమంత్రిగా లాల్దుహోమా ప్రమాణస్వీకారం
Mizoram | మిజోరం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జోరం పీపుల్స్ మూవ్మెంట్ (Zoram Peoples Movement) పార్టీ అధినేత లాల్దుహోమా (Lalduhoma) ప్రమాణస్వీకారం చేశారు.
Mizoram | మిజోరం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జోరం పీపుల్స్ మూవ్మెంట్ (Zoram Peoples Movement) పార్టీ అధినేత లాల్దుహోమా (Lalduhoma) ప్రమాణస్వీకారం చేశారు. ఐజ్వాల్‌లోని రాజ్‌భవన్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు జెడ్పీఎం (ZPM) ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇటీవలే జరిగిన మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాలకు గానూ 27 నియోజకవర్గాల్లో జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ గెలుపొంది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే.
74 ఏండ్ల వయసున్న లాల్దుహోమా.. ఐపీఎస్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. గోవా, ఢిల్లీలో ఆయన ఐపీఎస్‌గా పని చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సెక్యూరిటీ ఇంచార్జి ఆఫీసర్‌గా కూడా పని చేశారు. అదే సమయంలో రాజకీయాలకు ఆకర్షితుడైన లాల్దుహోమా తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల్లోకి వచ్చి 1984లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
#WATCH | Aizawl, Mizoram: Zoram People’s Movement (ZPM) leader Lalduhoma takes oath as the Chief Minister of Mizoram as the swearing-in ceremony begins pic.twitter.com/oCMbU2xVSf
— ANI (@ANI) December 8, 2023
Also Read..
KCR | కేసీఆర్ కోలుకునేందుకు 8 వారాలు పడుతుంది.. యశోద ఆస్పత్రి వైద్యులు
Chennai Rains | ఇంకా వరద గుప్పిట్లోనే చెన్నై.. మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చిన ఐఎండీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

