Indian Students | గత ఐదేళ్లలో విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థులు మృతి.. కెనడాలోనే అత్యధిక మరణాలు
Indian Students | విదేశాల్లో (Abroad) ఉన్నత చదువుల కోసం అని వెళ్లిన భారతీయ విద్యార్థులు (Indian Students ) ఇటీవలే పలు కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. అలా 2018 నుంచి ఇప్పటి వరకూ 400 మందికి పైగా భారతీయ విద్యార్థులు విదేశాల్లో మృత్యువాత పడినట్లు కేంద్ర ప్రభుత్వం (Centre) తాజాగా వెల్లడించింది.
Indian Students | విదేశాల్లో (Abroad) ఉన్నత చదువుల కోసం అని వెళ్లిన భారతీయ విద్యార్థులు (Indian Students ) ఇటీవలే పలు కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, అనారోగ్యం, మానసిక ఒత్తిడి ఇలా పలు కారణాలతో విద్యార్థులు మరణిస్తున్నారు. అలా 2018 నుంచి ఇప్పటి వరకూ 400 మందికి పైగా భారతీయ విద్యార్థులు విదేశాల్లో మృత్యువాత పడినట్లు కేంద్ర ప్రభుత్వం (Centre) తాజాగా వెల్లడించింది. ఇందులో అత్యధిక మరణాలు కెనడా (Canada)లోనే చోటుచేసుకున్నట్లు తెలిపింది.
ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ ( V Muraleedharan) రాజ్యసభ (Rajya Sabha)లో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు. 2018 నుంచి ఇప్పటి వరకూ మొత్తంగా 34 దేశాల్లో 403 మంది భారతీయులు వివిధ కారణాలతో మరణించినట్లు చెప్పారు. మంత్రిత్వ శాఖ సమర్పించిన డేటా ప్రకారం.. అత్యధికంగా కెనడాలోనే 91 మంది మృతి చెందారు. ఆ తర్వాత యూకేలో 48, రష్యాలో 40, అమెరికాలో 36, ఆస్ట్రేలియాలో 35, ఉక్రెయిన్‌లో 21, జర్మనీలో 20, సైప్రస్‌లో 14, ఇటలీ, ఫిలిప్పీన్స్‌లో 10 మంది చొప్పున విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
Also Read..
PM Modi | కేసీఆర్ త్వరగా కోలుకోవాలి : ప్రధాని మోదీ ట్వీట్
Earthquake | నాలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కంపించిన భూమి..
Praja Darbar | సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్.. భారీగా తరలి వచ్చిన ప్రజలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

