Chennai Rains | ఇంకా వరద గుప్పిట్లోనే చెన్నై.. మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చిన ఐఎండీ
Chennai Rains | మిగ్జాం తుఫాన్ (Cyclone Michaung) ప్రభావం నుంచి కోలుకోని తమిళనాడు రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. శుక్ర, శనివారాల్లో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Chennai Rains | మిగ్జాం తుఫాన్ (Cyclone Michaung) తాకిడికి తమిళనాడు రాజధాని చెన్నై (Chennai) అతలాకుతలమైంది. భీకర గాలులు, కుండపోత వానతో చెన్నైలోని అనేక ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. నగరంలో కురిసిన భారీ వర్షాల ధాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది. తుఫాన్ ప్రభావంతో సోమ, మంగళవారాల్లో కురిసిన భారీ వర్షాలు బుధవారానికి తగ్గాయి. వర్షాలు తగ్గి రెండు రోజులు అయినప్పటికీ నగరం ఇంకా వరద ముంపులోనే ఉంది. చాలా ప్రాంతాల్లో వరద నీరు ఇంకా తొలగిపోలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు, ఆహారం, నీరు లేక అల్లాడుతున్నారు.
తుఫాన్ ప్రభావం నుంచి కోలుకోని తమిళనాడు రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. శుక్ర, శనివారాల్లో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ‘రాబోయే 5 రోజుల్లో కేరళలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. అదేవిధంగా.. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, లక్షద్వీప్‌లో వచ్చే మూడు రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది’ అని వాతావరణ శాఖ తెలిపింది.
చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకారం.. కోయంబత్తూర్ జిల్లాల్లోని నీలగిరి, ఘాట్ ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నీలగిరి, కోయంబత్తూర్, తిరుపూర్, దిండిగల్, తేని, చెన్నై, విరుదునగర్, శివగంగ, పుదుక్కోట్టై, తంజావూరు జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు చెన్నైలోని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం శుక్రవారం కూడా సెలవు ప్రకటించింది. ఇక నగరంలో వర్షాల కారణంగా 20 మందికి పైగా మరణించారు. ప్రస్తుతం చెన్నైలో వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read..
PM Modi | కేసీఆర్ త్వరగా కోలుకోవాలి : ప్రధాని మోదీ ట్వీట్
Junior Mehmood | ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

