Junior Mehmood | ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు మృతి
Junior Mehmood | సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ మెహమూద్ (Junior Mehmood) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 67 ఏళ్లు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
Junior Mehmood | సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ మెహమూద్ (Junior Mehmood) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 67 ఏళ్లు.
కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మెహమూద్ అసలు పేరు నయీమ్ సయ్యద్. అయితే బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు మెహమూద్ని తలపించేలా యాక్టింగ్ చేస్తుండటంతో ఆయన్ని అంతా జూనియర్ మెహమూద్‌గా పిలుస్తుంటారు.
జూనియర్ మెహమూద్ కొన్ని రోజుల క్రితం స్టమక్ క్యాన్సర్ (stomach cancer) బారిన పడ్డారు. ప్రస్తుతం అది 4వ స్టేజ్‌లో ఉందన్న విషయం ఆయనకు నెల రోజుల క్రితం వైద్యుల ద్వారా తెలిసింది. ఆయన ఎక్కువ రోజులు బతకరని వైద్యులు కూడా చెప్పేశారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా మరణించారు. ఇక నటుడి మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మెహమూద్ సినిమాల విషయానికొస్తే.. 250కిపైగా చిత్రాల్లో నటించారు. మేరా నామ్ జోకర్, పర్వరిష్, కతి పతంగ్, దోఔర్ దో పాంచ్, మాఫియా, బాప్ నంబ్రి-బేటా దస్ నంబ్రీ తదితర చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read..
KCR | కేసీఆర్ కాలికి గాయం.. త్వరలోనే కోలుకుంటారంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్
BJP | ఆ మూడు రాష్ట్రాల్లో బీజేపీది గర్జించే గెలుపేమీ కాదు!
Kiara Advani | ఆ డైలాగ్‌తో సిద్ధార్థ్‌కు పడిపోయా అంటున్న కియారా అద్వాణీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

