KCR | కేసీఆర్ కాలికి గాయం.. త్వరలోనే కోలుకుంటారంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) దవాఖానలో చేరారు. ఆయన గురువారం రాత్రి అర్థరాత్రి కాలు జారి కిందపడటంతో తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను సోమాజిగూడ యశోదా హాస్పిటల్కు తరలించారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) దవాఖానలో చేరారు. గురువారం అర్థరాత్రి ఆయన కాలు జారి కిందపడటంతో తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను సోమాజిగూడ యశోదా హాస్పిటల్కు తరలించారు. పరిశీలించిన వైద్యులు కేసీఆర్ తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. దీంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, శుక్రవారం సాయంత్రం కేసీఆర్కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయనున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంపై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. కేసీఆర్కు స్వల్ప గాయమైందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. ఆయన త్వరలోనే కోలుకుంటారని వెల్లడించారు. కేసీఆర్పై ప్రజల ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు.
BRS supremo KCR Garu sustained a minor injury and is currently under expert care in the hospital. With the support and well-wishes pouring in, Dad will be absolutely fine soon.
Grateful for all the love 🙏🏼— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 8, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

