ఇది తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మించిన కొత్త పంబన్ వంతెన. ఇది భారత్‌లో తొలి వెర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన అని, ఇది ఆధునిక ఇంజినీరింగ్ అద్భుతమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అభివర్ణించారు.
త్వరలో అందుబాటులోకి రానున్న ఈ 2 కి.మీ. పొడవైన ఈ వంతెన వల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఈ వంతెన ఫొటోలను ఆయన ఎక్స్‌లో షేర్ చేశారు.