న్యూఢిల్లీ : ఆర్ఎస్ఎస్, బీజేపీల విద్వేష సిద్ధాంతం తాము అనుసరించే జాతీయవాద సిద్ధాంతాన్ని మరుగునపడేలా చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ శుక్రవారం జన్ జాగరణ్ అభియాన్ శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతూ మనకు ఇష్టమున్నా లేకున్నా ఆర్ఎస్ఎస్, బీజేపీల విభజిత రాజకీయాలు, విద్వేష సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ అనుసరించే ప్రేమపూర్వక, జాతీయవాద సిద్ధాంతాన్ని తోసిరాజేస్తోందని మనం దీన్ని అంగీకరించాలని అన్నారు.
ఎంతోకాలం మనం దీన్ని అంగీకరించకుండా ఉండలేమని పేర్కొన్నారు. మన సిద్ధాంతమే సజీవమైనది, మేలైనది అయినా విద్వేష సిద్ధాంతమే ముందుకొస్తోందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ విద్వేష, విభజిత రాజకీయాలపై రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు కొంతకాలంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.