Rahul Gandhi | బీజేపీ (BJP), కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కుమ్మక్కై ఎన్నికల్లో భారీ మోసానికి పాల్పడ్డాయని కాంగ్రెస్ (Congress) అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) కొద్ది రోజులుగా సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో ఓటరు జాబితాను సవరించి, పౌరుల ఓటు హక్కును దోచుకుంటున్నారని ఆరోపిస్తూ ‘ఓట్ అధికార్ యాత్ర’ (Vote Adhikar Yatra) పేరుతో యాత్ర చేపడుతున్నారు.
ఈ యాత్ర ప్రస్తుతం బీహార్‌లోని నవాడా (Nawada) జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ప్రయాణిస్తున్న వాహనం ఢీ కొని ఓ పోలీసు కానిస్టేబుల్ (Police Constable) గాయపడ్డాడు. ర్యాలీలో క్రౌడ్‌ను కంట్రోల్ చేస్తున్న కానిస్టేబుల్ కాలు ఒక్కసారిగా వాహనం కింద చిక్కుకుపోయింది. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#WATCH | Bihar | A police personnel deployed in security for ‘Voter Adhikar Yatra’ was bumped by the vehicle carrying Congress MP & LoP Rahul Gandhi and RJD leader Tejashwi Yadav in Nawada, today
The police personnel was rescued by other security personnel present, and LoP Rahul… pic.twitter.com/RrPl2PNpZd
— ANI (@ANI) August 19, 2025
రాహుల్ చేపట్టిన ఈ యాత్ర ససారాం నగరం నుంచి ఆదివారం యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర 16 రోజులపాటు 1,300 కిలోమీటర్ల దూరం 25 జిల్లాల మీదుగా కొనసాగనుంది. వచ్చే నెల 1న పట్నాలో నిర్వహించే భారీ సభతో యాత్ర ముగుస్తుంది. రాహుల్‌తోపాటు ఇండియా కూటమిలో భాగస్వాములైన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, మూడు వామపక్ష పార్టీల నేతలు యాత్రలో పాల్గొంటారు. కాలినడకతోపాటు వాహనాల్లో ప్రయాణిస్తూ రాహుల్ ఈ యాత్రను కొనసాగిస్తున్నారు.
Also Read..
Rabies | నాలుగు నెలల క్రితం కుక్క కాటు.. రేబీస్‌తో చిన్నారి మృతి
ChatGPT Go | భారతీయుల కోసం ఓపెన్ఏఐ చవకైన సబ్స్క్రిప్షన్ ప్లాన్.. రూ. 399కే ‘చాట్‌జీపీటీ గో’