ChatGPT Go | భారతీయ వినియోగదారులకు ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంస్థ ఓపెన్ఏఐ (OpenAI) గుడ్ న్యూస్ చెప్పింది. ‘చాట్‌జీపీటీ గో’ (ChatGPT Go) పేరుతో సరికొత్త, చవకైన సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను (new subscription plan) మంగళవారం ప్రకటించింది. కేవలం రూ.399కే ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ద్వారా భారతీయ వినియోగదారులు అధిక వినియోగ పరిమితులు, ఇమేజ్ జనరేషన్, ఫైల్ అప్లోడ్స్, ఎక్స్టెండెడ్ మెమరీ వంటి ప్రీమియం ఫీచర్లను తక్కువ ధరకే పొందవచ్చు.
ఉచిత ప్లాన్‌తో పోలిస్తే ‘చాట్ జీపీటీ గో’లో (ChatGPT Go) మెసేజ్ లిమిట్, ఇమేజ్ జనరేషన్, ఫైల్ లేదా ఇమేజ్ అప్లోడ్లు 10 రెట్లు ఎక్కువగా ఉండనున్నాయి. అంతేకాదు, మెమొరీ కూడా ఉచిత ప్లాన్‌తో పోలిస్తే రెండింతలు ఎక్కువగా ఉండనుంది. భారత్‌లో ఓపెన్ ఏఐ టూల్స్‌కు డిమాండ్ దృష్ట్యా.. చాట్‌జీపీటీ గో పేరుతో కొత్త సేవల్ని తీసుకొచ్చినట్లు సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇండిక్ లాంగ్వేజీ సపోర్టుతో పాటూ.. ఈ సబ్‌స్క్రిప్షన్‌కి యూపీఐ ద్వారా చెల్లింపులు చేయొచ్చని సంస్థ తెలిపింది.
కాగా, భారత్‌లో ఇప్పటికే పలు ప్లాన్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. పవర్ యూజర్ల కోసం ఉద్దేశించిన ‘చాట్‌జీపీటీ ప్లస్’ ప్లాన్ ధర నెలకు రూ. 1,999గా ఉంది. ఇక నిపుణులు, ఎంటర్‌ప్రైజ్‌ల కోసం ‘చాట్‌జీపీటీ ప్రో’ ప్లాన్‌ను నెలకు రూ. 19,900 రుసుముతో అందిస్తోంది. వాటికి అదనంగా ఈ కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులో ఉండనుంది.
Also Read..
Apple | యాపిల్ కళ్లు చెదిరే డీల్.. బెంగళూరు కార్యాలయానికి రూ.1,000 కోట్లు అద్దె..!