Mumbai | దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)లో మంగళవారం కూడా భారీ వర్షం (Heavy Rain) కొనసాగుతోంది. కుండపోత వర్షానికి నగరం మొత్తం స్తంభించిపోయింది. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా పాఠశాలలు, కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ఇచ్చారు. కొనసాగుతున్న భారీ వర్షం నేపథ్యంలో ప్రైవేటు సంస్థలు కూడా తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పించాలని సూచించారు.
ఆర్థిక రాజధానిలో నిరంతరాయంగా కొనసాగుతున్న కుండపోత వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. విమాన రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఫ్లైట్ రాడార్ డేటా ప్రకారం.. దాదాపు 250 విమానాలు ఆలస్యంగా (flights delayed) నడుస్తున్నాయి. ముంబై ఎయిర్‌పోర్ట్‌నుంచి బయల్దేరే దాదాపు 155 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముంబైకి వచ్చే విమానాలు కూడా ఆలస్యం అవుతున్నాయి. దీంతో పలు ఎయిర్‌లైన్స్ తమ ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేశాయి. మరోవైపు రైల్వే ట్రాక్‌లపై పెద్ద ఎత్తున నీరు చేరటంతో సెంట్రల్ రైల్వే మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ముంబై నగరం, శివారు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ అలర్ట్‌తో అధికారులు అప్రమత్తమయ్యారు.
Also Read..
PM Modi | ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు ప్రతిపక్షాలు మద్దతివ్వాలి: ప్రధాని మోదీ
Spinning Ride | ఆలయ ఉత్సవంలో అపశ్రుతి.. స్పిన్నింగ్ రైడ్ కూలి ఐదుగురికి గాయాలు.. షాకింగ్ వీడియో