Woman Traffic Cop | మహారాష్ట్ర (Maharashtra)లో దారుణ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో ఓ ఆటో డ్రైవర్ (Drunk Driver) డ్యూటీలో ఉన్న మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ను దాదాపు 120 మీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన సతారా (Satara) జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. సతారా నగరంలోని ఓ కూడలి వద్ద సోమవారం ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఓ ఆటోని డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ భాగ్యశ్రీ జాదవ్ (Bhagyashree Jadhav) ఆపింది. అయితే, ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో ఫైన్ తప్పించుకునేందుకు ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. దీంతో సదరు మహిళా కానిస్టేబుల్ ఆటోకు అడ్డుపడింది. అయినా లెక్కచేయకుండా డ్రైవర్ ఆమెను ఢీకొట్టి అలాగే ఈడ్చుకుంటూ వెళ్లాడు. అప్రమత్తమైన స్థానికులు ఆటోను వెంబడించి ఆపారు. అనంతరం డ్రైవర్ను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్కు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ను దేవరాజ్ కాలేగా (Devraj Kale) గుర్తించారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ దృష్యాలు వైరల్ అవుతున్నాయి.
Video: Drunk autorickshaw driver drags woman cop trying to stop him in Maharashtra#Maharashtra #Satara #KhandobaMaal #VIDEO #ViralVideos pic.twitter.com/t7pZivZi35
— Princy Sharma (@PrincyShar14541) August 19, 2025
Also Read..
Spinning Ride | ఆలయ ఉత్సవంలో అపశ్రుతి.. స్పిన్నింగ్ రైడ్ కూలి ఐదుగురికి గాయాలు.. షాకింగ్ వీడియో
Manika Vishwakarma | మిస్ యూనివర్స్ ఇండియా-2025గా మణిక విశ్వకర్మ..!