Anemia | ప్రతి పది మంది భారతీయ మహిళల్లో ఆరుగురు ప్రమాదంలో..! అనీమియా పెరుగుతుండడంపై నిపుణుల ఆందోళన..!
Anemia | ప్రపంచవ్యాప్తంగా అనీమియా పెద్ద సమస్యగా మారింది. ప్రత్యేకంగా భారతీయ మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తోంది. నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే (NFHS-5) 2019–21 నివేదిక ప్రకారం.. 15-49 ఏళ్ల వయస్సున్న భారతీయ మహిళలలో సుమారు 57 శాతం అనీమియాతో బాధపడుతున్నారని తెలుస్తోంది.
Anemia | ప్రపంచవ్యాప్తంగా అనీమియా పెద్ద సమస్యగా మారింది. ప్రత్యేకంగా భారతీయ మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తోంది. నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే (NFHS-5) 2019–21 నివేదిక ప్రకారం.. 15-49 ఏళ్ల వయస్సున్న భారతీయ మహిళలలో సుమారు 57 శాతం అనీమియాతో బాధపడుతున్నారని తెలుస్తోంది. అంటే ప్రతి 10 మహిళల్లో 6 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. గర్భిణుల్లో ఈ సంఖ్య సుమారు 52 శాతంగా ఉంది. అదేవిధంగా 15-19 ఏళ్ల యువతిలోనూ సగటున సగానికిపైగానే ఈ సమస్యతో బాధపడుతున్నట్లుగా గణాంకాలు పేర్కొంటున్నాయి.
అనీమియా అంటే ఏంటీ..?
అనీమియా అంటే రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం. హిమోగ్లోబిన్ మన శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్‌ను పంపే ముఖ్యమైన ప్రోటీన్. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే శరీరం అలసటగా, బలహీనంగా మారుతుంది. పనిలో ఆసక్తి తగ్గిపోతుంది. గర్భిణుల్లో అయితే ఇది గర్భస్రావం, తొందరపుట్టే ప్రమాదం పెరుగుతుంది. ఆరోగ్య నిపుణులు భారతీయ మహిళలలో అనీమియా చాలా సాధారణమై ఉందని, ఇది రోజురోజుకు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఐరన్ లోపమేనని పేర్కొంటున్నారు. జీవనశైలిలో వస్తున్న మార్పులు, దురాలవాట్లు, సామాజిక కారణాలు కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. సరైన ఆహారం తీసుకోవడం, వైద్యుల సూచనల మేరకు సప్లిమెంట్స్ తీసుకోవడం, అనీమియా గురించి సరైన అవగాహన ఉంటే సమస్యకు అడ్డుకట్ట వేయొచ్చని చెబుతున్నారు.
అనీమియాపై ఉన్న అపోహలు.. వాస్తవాలు..
అనీమియాపై ఉన్న అపోహలను తొలగించాలని వైద్యులు పేర్కొంటున్నారు. చాలామంది అనీమియా ఐరన్ కొరత వల్లే కలుగుతుందని అపోహ ఉన్నది. అయితే, అనీమియా అంటే ఐరన్ శరీరంలో ఐరన్ లెవల్స్ తగ్గిపోవడమేనని చాలామంది అనుకుంటారు. కానీ, ఇది పూర్తిగా నిజం కాదు. అనీమియా అంటే రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం. ఐరన్ కొరత అనేది ప్రధాన కారణాల్లో ఒకటి. ఫోలిక్ ఆసిడ్, విటమిన్ B12 లాంటి పోషకాల కొరత కూడా కారణం అవుతుంది. అదేవిధంగా మలేరియా, తలసేమియా వంటి వ్యాధులూ సైతం అనీమియాకు దారి తీస్తాయి. ఐరన్ కొరత వల్ల ఏర్పడే అనీమియా మొత్తం కేసుల్లో సుమారు 50 శాతమే అని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
మాంసహారులు కాకపోవడం వల్ల అనీమియా వచ్చే ప్రమాదం ఉంటుందనే అపోహ కూడా ఉంది. మాంసాహారంలో ఐరన్ ఎక్కువగా ఉండడంతో, మాంసాహారం తినని వారంతా తప్పనిసరిగా అనీమియా బారినపడుతుంటారని చాలామందిలో అభిప్రాయం ఉంది. ఇది పూర్తిగా నిజం కాదు. మాంసహారం తింటే ఐరన్ లభిస్తుంది. మాంసం, చేపలు తినని వారిలో లోపం ఖచ్చితంగా ఉంటుందని తరచుగా నమ్ముతారు. ఇందులో సగం మాత్రమే నిజం ఉంది. మాంసాహారం తినడం వల్ల అవసరాలు తీరుతాయి. కానీ శాకాహారులకు రక్తహీనత ఖచ్చితంగా వస్తుందని కాదు. శాకాహారంతోనూ రక్తహీనతను తగ్గించొచ్చు, బజ్రా, రాగి, పప్పులు, సోయా, పచ్చి కూరగాయలు, బెల్లం, నువ్వులు, డ్రై ఫ్రూట్స్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
అలాగే, రక్తంలో హెమోగ్లోబిన్ తక్కువగా ఉండడం వల్లే అనీమియా వస్తుందని మరో అపోహ సైతం ఉంది. ఇదేం పెద్ద సమస్య కాదని భావిస్తుంటారు. దాంతో అనీమియాను చాలా తక్కువగా అంచనా వేస్తుంటారు. కానీ, ఇలాంటి ఆలోచనలు పూర్తిగా తప్పని నిపుణులు పేర్కొంటున్నారు. అనీమియా శరీరంలో అలసట, తలనొప్పి, దృష్టి సమస్య, పనితీరు తగ్గడం తదితర సమస్యలకు కారణమవుతుంది. గర్భిణుల్లో దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. బిడ్డ తక్కువ బరువుతో పుట్టే ప్రమాదం.. ముందస్తుగానే పిల్లలు జన్మించడం, ఇతర సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. అందుకే ఏదైనా స్థాయిలో అనీమియా ఉన్నట్లయితే వెంటనే గుర్తించి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అనీమియా పెరుగుతున్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని, సమాజంలో ఉన్న అపోహలను తొలగించి సరైన ఆహారం, వైద్య సహాయం తీసుకోవడంతో పాటు అవగాహన పెంచుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడే అవకాశాలుంటాయని పేర్కొంటున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
KTR | భారత రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. జ్ఞానేష్ కుమార్ తక్షణమే వైదొలగాలి: కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

