Spinning Ride | గుజరాత్ (Gujarat)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నవసరి (Navsari) జిల్లాలో జరిగిన ఓ ఆలయ ఉత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఉత్సవాల్లో (temple fair) భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్పిన్నింగ్ రైడ్ (Spinning Ride) ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో చిన్నారులు సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
జిలిమోరా పట్టణంలో ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ బీవీ గోహిల్ తెలిపారు. ఉత్సవానికి వచ్చిన భక్తులు సరదాగా రైడ్‌ను ఆస్వాదిస్తుండగా ఒక్కసారిగా కూలిపోయినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు, ఓ రైడ్ ఆపరేటర్ గాయపడినట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో అందులో ఎనిమిది నుంచి తొమ్మిది మంది కూర్చుని ఉన్నట్లు వెల్లడించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన ఆపరేటర్‌ను సూరత్‌లోని ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. కాగా, ఆలయ ఉత్సవాల్లో భాగంగా ఏడు రైడ్లకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Gujarat – At a fair in Navsari, a swing suddenly fell from a height of 50 feet last night. Several people were injured in this accident.
pic.twitter.com/UUwjOlpnvg— Ghar Ke Kalesh (@gharkekalesh) August 19, 2025
Also Read..
Manika Vishwakarma | మిస్ యూనివర్స్ ఇండియా-2025గా మణిక విశ్వకర్మ..!