Apple | యాపిల్ కళ్లు చెదిరే డీల్.. బెంగళూరు కార్యాలయానికి రూ.1,000 కోట్లు అద్దె..!
Apple | భారత్‌లో ఐఫోన్ల (iPhones) తయారీని భారీగా పెంచడంపై దృష్టి సారించిన దిగ్గజ టెక్ కంపెనీ యాపిల్ (Apple) సంస్థ.. తయారీ, విక్రయ కార్యకలాపాల్ని వేగంగా విస్తరిస్తోంది.
Apple | భారత్‌లో ఐఫోన్ల (iPhones) తయారీని భారీగా పెంచడంపై దృష్టి సారించిన దిగ్గజ టెక్ కంపెనీ యాపిల్ (Apple) సంస్థ.. తయారీ, విక్రయ కార్యకలాపాల్ని వేగంగా విస్తరిస్తోంది. దేశీయంగా ఐఫోన్ ఉత్పత్తిని పెంచనున్నట్లు ఇప్పటికే యాపిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా బెంగళూరు (Bengaluru)లో ఎంబసీ జెనిత్ భవనంలో 2.7 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని అద్దెకు తీసుకుంది.
డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్‌స్టాక్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ ఎంబసీ గ్రూప్ (Embassy Group)కు చెందిన కమర్షియల్ ప్రాజెక్టు ఎంబసీ జెనిత్ (Embassy Zenith)లోని ఆ కార్యాలయ స్థలం కోసం 10 ఏళ్ల కాలానికి యాపిల్ సంస్థ డీల్ కుదుర్చుకుంది. 9 అంతస్తుల్లో (5 నుంచి 13వ అంతస్తు వరకు) విస్తరించి ఉన్న ఈ ఆఫీస్ స్పేస్ కోసం యాపిల్ సంస్థ నెలకు రూ.6.3 కోట్ల అద్దె చెల్లించనుంది. ఏడాదికి 4.5 శాతం చొప్పున అద్దె పెంపుతో పార్కింగ్, మెయింటెనెన్స్ చార్జీలతో కలిపిమొత్తం ఈ పదేళ్లలో సంస్థ రూ.1,000 కోట్లను అద్దెగా చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంది. 2025 ఏప్రిల్ 3 నుంచి ఈ లీజు అమల్లోకి వచ్చింది. ఈ లీజు ఒప్పందంలో భాగంగా యాపిల్ రూ.31.57 కోట్లు డిపాజిట్ కూడా చేసింది. కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి అతి పెద్ద మొబైల్ ఫోన్ల ఎగుమతిదారుగా యాపిల్ నిలిచిన విషయం తెలిసిందే. సుమారు రూ.1.5 లక్షల కోట్ల విలువైన ఫోన్లను ఎగుమతి చేసింది.
Also Read..
Trump Tariffs | రిస్క్‌లో 3 లక్షల ఉద్యోగాలు.. భారతీయ ఎగుమతులపై అమెరికా సుంకాల ప్రభావం
ల్యాప్స్ పాలసీలపై ఎల్ఐసీ ప్రత్యేక ఆఫర్లు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

