న్యూఢిల్లీ, ఆగస్టు 18 : బీమా దిగ్గజం ఎల్ఐసీ.. ల్యాప్స్ పాలసీలు పునరుద్దరించుకునేవారికి ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 18 నుంచి అక్టోబర్ 17 వరకు మూడు నెలల పాటు వ్యక్తిగత ల్యాప్స్ పాలసీల లేట్ ఫీజుపై 30 శాతం వరకు తగ్గింపునిస్తున్నది. అలాగే నాన్-లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలపై 30 శాతం లేట్ ఫీజు లేదా గరిష్ఠంగా రూ.5 వేల వరకు రాయితీ పొందవచ్చునని తెలిపింది.
చెల్లింపులు జరపనప్పటి నుంచి ఐదేండ్లు లోపు పాలసీలు మాత్రమే ఈ ప్రత్యేక ఆఫర్ కింద చెల్లించుకోవచ్చును. దీంట్లోభాగంగా లక్ష రూపాయల వరకు 30 శాతం లేదా రూ.3,000, రూ.1,00,001 నుంచి రూ.3 లక్షల వరకు 30 శాతం లేదా రూ.4 వేలు, రూ.3,00,001 ఆ పై ప్రీమియంపై 30 శాతం లేదా రూ.5 వేల వరకు రాయితీ పొందవచ్చునని ఒక ప్రకటనలో వెల్లడించింది.