న్యూఢిల్లీ, ఆగస్టు 18: జీఎస్టీ స్లాబ్‌లు మారితే ఏసీల ధరలు రూ.2,500 వరకు తగ్గే వీలున్నది. ప్రస్తుతం ఏసీలపై 28 శాతం జీఎస్టీ విధిస్తుండగా, త్వరలో ఈ స్లాబ్‌ను ఎత్తివేస్తామని కేంద్రం చెబుతున్నది.
దీంట్లో ఉన్న మెజారిటీ వస్తువులు 18 శాతం స్లాబ్‌లోకి మారనున్నాయి. దీంతో ఏసీలపై 10 శాతం వరకు జీఎస్టీ తగ్గే అవకాశాలున్నాయి.