Acid Thrown On School Girl | స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న బాలిక.. ముఖంపై యాసిడ్ పోసిన వ్యక్తి
Acid Thrown On School Girl | ఒక బాలిక స్కూల్ ముగిసిన తర్వాత నడుస్తూ ఇంటికి వెళ్తున్నది. గుర్తు తెలియని వ్యక్తి ఆమె ముఖంపై యాసిడ్ పోసి పారిపోయాడు. బాలిక అరుపులు విన్న స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ముంబై: ఒక బాలిక స్కూల్ ముగిసిన తర్వాత నడుస్తూ ఇంటికి వెళ్తున్నది. గుర్తు తెలియని వ్యక్తి ఆమె ముఖంపై యాసిడ్ పోసి పారిపోయాడు. బాలిక అరుపులు విన్న స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. (Acid Thrown On School Girl) మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వాడ్గావ్ పాన్ ప్రాంతంలో నివసించే 11 ఏళ్ల బాలిక ఆరో తరగతి చదువుతున్నది. మంగళవారం స్కూల్ ముగిసిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్నది. గుర్తు తెలియని వ్యక్తి ఆ బాలిక ముఖంపై యాసిడ్ పోసి పారిపోయాడు.
కాగా, ముఖంపై యాసిడ్ పడటంతో ఆ బాలిక బాధతో అల్లాడిపోయింది. ఆ చిన్నారి అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. చికిత్స కోసం లోనిలోని ప్రవరానగర్ ఆసుపత్రికి ఆ బాలికను తరలించారు.
మరోవైపు ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికపై యాసిడ్ పోసిన వ్యక్తిని గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. స్కూల్‌కు వెళ్లే చిన్నారిపై ఆ వ్యక్తి ఎందుకు యాసిడ్ దాడి చేశాడో అన్నది దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఆ బాలిక పేద కుటుంబానికి చెందినట్లు పోలీస్ అధికారి తెలిపారు. కొంతకాలం కిందట ఆమె తండ్రి మరణించినట్లు చెప్పారు. దీంతో తల్లితో కలిసి తాత ఇంట్లో నివసిస్తున్నట్లు తెలిసిందన్నారు. బాలిక తల్లి రోజు వారీ కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నట్లు పోలీస్ అధికారి వివరించారు. బాలికపై జరిగిన యాసిడ్ దాడి ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Woman dies after tooth extraction | పన్ను పీకిన తర్వాత మహిళ మృతి.. డెంటల్ డాక్టర్ పరార్
Indore Fire Blast | ఈవీ కారుకు మంటలు, పేలిన గ్యాస్ సిలిండర్లు.. ఏడుగురు సజీవ దహనం
Russian oil tanker | చైనా వెళ్తున్న రష్యా ఆయిల్ ట్యాంకర్.. దారి మళ్లి భారత్‌కు ప్రయాణం
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- acid
- Ahilyanagar
- Face
- Maharashtra
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

