L&T Chairman | ఆ మాటలకు నా భార్య కూడా బాధపడింది.. వారానికి 90 గంటల పని వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన ఎల్అండ్టీ చైర్మన్
L&T Chairman | ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలని, ఆదివారాలు సైతం కార్యాలయాలకు వెళ్లాలని ఎల్అండ్టీ చైర్మన్ (L&T Chairman) ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ (SN Subrahmanyan) ఇటీవలే చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.
L&T Chairman | ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలని, ఆదివారాలు సైతం కార్యాలయాలకు వెళ్లాలని ఎల్అండ్టీ చైర్మన్ (L&T Chairman) ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ (SN Subrahmanyan) ఇటీవలే చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘ఎప్పుడూ ఇంట్లోనే ఉంటూ ఏం చేస్తారు..? ఎంతసేపని భార్య ముఖం తదేకంగా చూడగలరు? ’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే, ఆ వ్యాఖ్యలపై సుబ్రహ్మణ్యన్ తాజాగా స్పందించారు. భార్యను ఎంతసేపు చూస్తూ ఉండిపోతారని అన్న మాటలకు తన భార్య కూడా బాధ పడిందని చెప్పారు. ఇకపై ఆచితూచి మాట్లాడతానని వెల్లడించారు.
కంపెనీకి సంబంధించిన సమస్యల గురించి ఆందోళనలో ఉన్న సమయంలో అలా మాట్లాడానని వివరణ ఇచ్చారు. ‘కంపెనీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టుల్లో జాప్యంపై కొంతమంది ఉన్నతస్థాయి వ్యక్తుల నుంచి కాల్స్, ఈమెయిల్స్ ద్వారా నాకు వ్యక్తిగతంగా ఫిర్యాదులు వచ్చాయి. ప్రాజెక్టుల్లో పురోగతి గురించి వారు ఆందోళన వ్యక్తం చేశారు. పని జరగాల్సిన విధంగా జరగకపోవడంతో ఆందోళన చెందాను. ఆ సమయంలో అలా మాట్లాడాను. అంతేకానీ ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు. వేరే పరిస్థితుల్లో అయితే మరోలా మాట్లాడేవాడిని. నా మాటలు రికార్డ్ చేస్తున్నట్లు కూడా నాకు తెలియదు. ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు అంటూ నేను అన్న మాటలకు నా భార్య కూడా బాధపడింది’ అంటూ చెప్పుకొచ్చారు.
ఈ ఏడాది జనవరిలో తన ఉద్యోగులతో ఇంటరాక్షన్ సందర్భంగా సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ.. ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని (90-hour work week) సూచించారు. అవసరమైతే ఆదివారాలు కూడా వదులుకోవాలన్నారు. ఎంతసేపు అలా భార్యను చూస్తూ ఉండిపోతారు..? అంటూ ప్రశ్నించారు. ఇంట్లో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కవ సమయం ఉంటామని భార్యలతో చెప్పాలని ఉద్యోగులతో అన్నారు. ‘ఆదివారాలు మీతో పనిచేయించలేకపోతున్నందుకు బాధపడుతున్నా. మీతో ఆదివారాలూ పనిచేయించగలిగితే నేను మరింత సంతోషంగా ఉంటాను. ఎందుకంటే నేను ఆదివారాలు కూడా పనిచేస్తున్నాను’ అని ఉద్యోగులతో అన్నారు.
ఈ సందర్భంగా సంస్థలో వారానికి ఆరు రోజుల పని విధానాన్ని అమలు చేయడాన్ని ఓ ఉద్యోగి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా.. ‘ఆదివారాలు కూడా మీతో పని చేయించలేకపోతున్నందుకు నేను బాధపడుతున్నాను. మీతో ఆదివారాలు సైతం పని చేయిస్తే చాలా సంతోషపడతాను. ఎందుకంటే, నేను ఆదివారాలు కూడా పని చేస్తున్నాను. ఎంత సేపు ఇంట్లో కూర్చుంటావు? ఎంతసేపు నీ భార్యను అలా తదేకంగా చూస్తూ ఉండగలవు? ఆఫీసుకు వెళ్లి పని చేయడం ప్రారంభించు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read..
ChatGPT Go | భారతీయుల కోసం ఓపెన్ఏఐ చౌకైన సబ్స్క్రిప్షన్ ప్లాన్.. రూ. 399కే ‘చాట్జీపీటీ గో’
Apple | యాపిల్ కళ్లు చెదిరే డీల్.. బెంగళూరు కార్యాలయానికి రూ.1,000 కోట్లు అద్దె..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

